logo

ఉత్సాహంగా ఎడ్ల పందేలు

తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎడ్ల పందేల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలను ప్రముఖ సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌,   సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు మణిశర్మ, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరై పోటీలను తిలకించారు.

Published : 03 Oct 2022 05:28 IST

బండను లాగుతున్న ఎడ్లు

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎడ్ల పందేల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలను ప్రముఖ సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌,   సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు మణిశర్మ, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరై పోటీలను తిలకించారు. కోదండరామిరెడ్డి, గోపాల్‌, గోపాల్‌రెడ్డి, మణిశర్మలు పందేలను ప్రారంభించి పోటీల్లో పాల్గొన్న రైతులకు రైస్‌ కుక్కర్లు అందించారు. అత్తిలి సుబ్రహ్మణ్యస్వామిపై పాటలకు సంగీతం సమకూర్చిన మణిశర్మ ఆడియోను విడుదల చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, సంచార జాతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వీరయ్య, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి వీర్రాజు, రసరాజు, శ్రీనివాసనాయుడు, మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.\

విజేతలు వీరే.. న్యూ కేటగిరి విభాగంలో 1500 కిలోల బండను కటకం వెంకటేశ్వర్లు(పల్నాడు జిల్లా, ఇనుమెట్ల)కు చెందిన ఎడ్లు లాగి ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. ఈయనకు రూ.70 వేల నగదు బహుమతి అందించారు. కాటంపెద్దిరెడ్డి(ప్రకాశం జిల్లా, కాటంవారిపాలెం)కి చెందిన ఎడ్లు రెండో బహుమతిని గెలుచుకున్నాయి.

పోటీల్లో పాల్గొన్న రైతులకు బహుమతులు అందజేస్తున్న కోదండరామిరెడ్డి, మణిశర్మ, బి.గోపాల్‌, గోపాల్‌రెడ్డి తదితరులు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు