logo

దారికి రాని పనులు

ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి విస్తరణకు ఇరువైపులా తవ్వి వదిలేశారు. పలు చోట్ల కల్వర్టులు నిర్మించారు. శ్రీపర్రు వద్ద వంతెన నిర్మాణం పునాదుల్లో నిలిచింది. శ్రీపర్రు- కలకుర్రు మధ్యలో మార్జిన్లు తవ్వి వదిలేయడంతో రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

Updated : 03 Oct 2022 11:57 IST

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

నిలిచిన ఎన్‌డీబీ మార్గాలు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే

వంగాయగూడెం నుంచి పెరికీడు రోడ్డులో కల్వర్టులు మాత్రమే నిర్మించారు. వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ఈ రహదారి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

లూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి విస్తరణకు ఇరువైపులా తవ్వి వదిలేశారు. పలు చోట్ల కల్వర్టులు నిర్మించారు. శ్రీపర్రు వద్ద వంతెన నిర్మాణం పునాదుల్లో నిలిచింది. శ్రీపర్రు- కలకుర్రు మధ్యలో మార్జిన్లు తవ్వి వదిలేయడంతో రాకపోకలకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు పక్కకు తొలగేందుకు వీలు లేక కిలోమీటర్ల మేర బారులు తీరి ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది.

ఉమ్మడి జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మొత్తం 74 కిలోమీటర్ల మేర 11 రహదారులను రెండు వరుసలతో విస్తరించాలని రహదారులు, భవనాల శాఖ నిర్ణయించింది. రూ.201 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను ఒకే ప్యాకేజీగా గతేడాది మేలో హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ దక్కించుకుంది. రెండేళ్లలో పూర్తిచేయాలని అధికారులు గడువు విధించారు. అయితే ఇప్పటివరకు 13 శాతం పనులే జరిగాయి. రహదారుల విస్తరణలో భాగంగా కల్వర్టులు, రక్షణ గోడల నిర్మాణం వంటి రూ.15 కోట్లు విలువ చేసే పనులు చేశారు.  పనులకు సంబంధించిన బిల్లులను అధికారులు ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేశారు. గుత్తేదారుకు సొమ్ములు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపివేశారు. మిగతావి ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్దేశిత సమయానికి పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
నిధుల లేమితో రహదారులను అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల నిర్మాణానికి బ్యాంకులు రుణమిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

గడువులోగా పనుల పూర్తికి చర్యలు
- జి.వి. భాస్కరరావు, పర్యవేక్షక ఇంజినీర్‌, రహదారులు భవనాల శాఖ

నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం. గుత్తేదారు చేసిన పనులకు సంబంధించి బిల్లులను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేశాం. మంజూరు కావాల్సి ఉంది. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో పనులకు ఆటంకంగా మారింది. వర్షాలు తగ్గగానే పనులను వేగవంతం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు