logo

పక్కాగా ఓటర్ల జాబితా రూపకల్పన

పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు

Published : 05 Oct 2022 06:07 IST

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే గుర్తించి సవరణలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఎన్నికల్లో ఓట్లు గల్లంతయ్యాయంటూ ఫిర్యాదులు వస్తుంటాయని, ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా పక్కాగా జాబితాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1454 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, వాటిలో ఏడింటిని ఇతర ప్రాంతాలకు మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. నరసాపురం సబ్‌కలెక్టర్‌ విష్ణుచరణ్‌, భీమవరం ఆర్డీవో దాసి రాజు, శ్యాంబాబు (తెదేపా), కోమటి రవికుమార్‌ (భాజపా), కామన నాగేశ్వరరావు (వైకాపా), చెల్లబోయిన రంగారావు (సీపీఐ) పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని