logo

ముందుకొస్తే చేయూత

ఏదైనా ప్రాంతం ఆర్థికంగా రాణించాలన్నా, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలం, ముడిసరకుల లభ్యత, సాంకేతిక నైపుణ్యం,

Updated : 05 Oct 2022 07:01 IST

పరిశ్రమల స్థాపనకు అనుమతులు, రాయితీలకు ఏర్పాట్లు  

ఔత్సాహికులకు మరిన్ని అవకాశాలు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే : ఏదైనా ప్రాంతం ఆర్థికంగా రాణించాలన్నా, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలం, ముడిసరకుల లభ్యత, సాంకేతిక నైపుణ్యం, రవాణా సౌకర్యం, నీటివనరులు, మార్కెటింగ్‌ ఇలా అనేక అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఆశావహులు ముందుకొస్తే సహకారం అందిస్తామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు.ఏలూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇటీవలే కలెక్టర్‌ కార్యాలయంలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేశారు. ఏయే పరిశ్రమలు స్థాపించాలి, ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తదితర అంశాలను వివరించారు.
21 రోజుల్లోనే అన్ని అనుమతులు
పరిశ్రమలు స్థాపించాలనుకునే ఆశావహులకు సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా కావాల్సిన అనుమతులు 21 రోజుల్లో ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దస్త్రాలతో ముందుకొస్తే అనుమతుల కోసం నెలలు, సంవత్సరాల తరబడి తిరగకుండా ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పరిశ్రమల స్థాపనకు ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం, ఓసీలకు 15 శాతం, బీసీ, మైనార్టీలకు 35 శాతం రాయితీలు ఇస్తున్నారు. విద్యుత్తు యూనిట్‌కు రూ.1 నుంచి రూ. 1.50 వరకు సబ్సిడీ కల్పిస్తున్నారు. లబ్ధిదారుల కేటగిరీలను బట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాయితీల్లో తేడాలుండే అవకాశముంది.
ఆశాజనకంగా స్వయం ఉపాధి యూనిట్లు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వ్యక్తిగతంగా ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసుకున్న యూనిట్ల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 2021- 22లో 82 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా దానికి మించి 131 యూనిట్లు మంజూరు చేశారు. 2022-23 సంవత్సరానికి ఏలూరు జిల్లాలో 44 యూనిట్లు లక్ష్యం కాగా 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13 యూనిట్లు మంజూరు కాగా మిగిలినవి పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యం
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారు ఎన్నుకున్న పరిశ్రమల స్థాపన సకాలంలో జరిగేలా సహకరిస్తాం. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ మంచి ప్రణాళికతో ముందుకు వస్తే అనుకున్న సమయానికే పరిశ్రమల ఏర్పాటు వీలవుతుంది. - ఏసుదాసు, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్‌ మేనేజర్‌

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని