logo

భలే బుల్లిపిట్ట!

కొల్లేరులో కనువిందు చేసే పక్షుల్లో ఉల్లింకిపిట్ట (కామన్‌ శాండ్‌ పైపర్‌) ఒకటి. ఇది పిచ్చుక ఆకారంలో ఉండి.. 250 నుంచి 400 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది.

Published : 26 Nov 2022 06:14 IST

కొల్లేరు అతిథి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొల్లేరులో కనువిందు చేసే పక్షుల్లో ఉల్లింకిపిట్ట (కామన్‌ శాండ్‌ పైపర్‌) ఒకటి. ఇది పిచ్చుక ఆకారంలో ఉండి.. 250 నుంచి 400 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. వలస పక్షి శీతాకాలంలో మాత్రమే కొల్లేరు చేరుకుంటుంది. యూరప్‌, సైబీరియా, రష్యా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నీటి శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్న సైజు పుల్ల ముక్కలతో గూడు ఏర్పాటు చేసుకుంటుంది. చిన్న చేపలు, పురుగులు, ఆహారంగా సేకరిస్తుంది. శీతాకాలంలో మూడు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంది. వేసవికాలం మొదటిలోనే ఈ ప్రాంతం నుంచి తన పిల్లలతో తరలి వెళ్లిపోతుంటుంది. కొల్లేరులో సుమారు ఇవి 2 వేల వరకు ఉంటాయని అటవీశాఖ అధికారుల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని