logo

మొగల్తూరులో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు

మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వ భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేసేశారని సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ వెల్లడించారు.

Published : 26 Nov 2022 06:14 IST

సబ్‌కలెక్టర్‌ తనిఖీలో బయటపడ్డ అక్రమాలు

వివరాలు వెల్లడిస్తున్న సూర్యతేజ

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వ భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేసేశారని సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయన తహశీల్దారు జి.అనితా కుమారితో కలిసి దస్త్రాలు, కంప్యూటర్‌ లావాదేవీలను సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిషేధిత జాబితాలోని భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు అంగీకరించారన్నారు. తాము గత సెప్టెంబరు 1 నుంచి రెండు నెలల్లో ఇక్కడ జరిగిన లావాదేవీలపై తనిఖీలు చేశామన్నారు. ప్రభుత్వ, నిషేధిత జాబితాలో ఉన్న 47 ఎకరాల వ్యవసాయ భూమి, 11,727 చదరపు గజాల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇంకా పరిశీలించాల్సినవి ఉన్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ చేసిన, చేయించుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేయిస్తామన్నారు. ప్రభుత్వ భూములను కాపాడతామని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని