logo

ఇబ్బందులు పడే ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం: గన్ని

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 30, డిసెంబరు 1, 2 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు.

Updated : 27 Nov 2022 04:49 IST

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు, చిత్రంలో రవీంద్ర,  మాగంటి బాబు, గన్ని, సుజాత తదితరులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 30, డిసెంబరు 1, 2 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను  పర్యవేక్షించేందుకు శనివారం జంగారెడ్డిగూడెం వచ్చిన ఆయన స్థానిక తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెదవేగి మండలం విజయరాయిలో జరిగే బహిరంగ సభ ద్వారా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమానికి చంద్రబాబునాయుడు శ్రీకారం చుడతారన్నారు.  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుకు ఇదేం ఖర్మ, వరి రైతులకు సంబంధించి ‘ఏం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాలు చంద్రబాబు పర్యటనలో ఉంటాయని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడే ప్రతి ఒక్కరినీ ఆయా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నామన్నారు.  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రికి బీసీలు గుర్తుకు రాలేదన్నారు. 1994లోనే బీసీల మంత్రిత్వ శాఖను తెదేపా ఏర్పాటు చేసిందన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అభివృద్ధి సున్నా. వైకాపా జేబుల్‌ ఫుల్‌ అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ తెదేపాను అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఊహకందని రీతిలో ప్యాలెస్‌కు డబ్బు: దేవినేని

తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత డబ్బు తరలుతుందో ఊహకు అందడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో రూ.రెండు వేల నోట్లు కనిపించడం లేదని, ఆయా నోట్ల కట్టల సంచులు గన్నవరం విమానాశ్రయం మీదుగా బేగంపేటకు, అక్కడి నుంచి యూపీ, పశ్చిమబెంగాల్‌, నేపాల్‌కు తరలిపోతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందన్నారు. వైకాపాది తుమ్మితే ఊడి పోయే ముక్కు అని ఎద్దేవా చేశారు. పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, ధాన్యం రైతులను గాలికి వదిలేశారన్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని