logo

ఆయిల్‌పామ్‌ సాగు పరిశీలన

సేంద్రియ విధానంలో ఆయిల్‌పామ్‌ సాగు పరిశీలన నిమిత్తం ఫ్రాన్స్‌ దేశానికి చెందిన సీఐఆర్‌ఏడీ సంస్థ ప్రతినిధులు శనివారం పెదవేగి మండలం బాపిరాజుగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించారు.

Published : 27 Nov 2022 04:30 IST

లక్ష్మీపురంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఫ్రాన్స్‌ ప్రతినిధులు

పెదవేగి, న్యూస్‌టుడే: సేంద్రియ విధానంలో ఆయిల్‌పామ్‌ సాగు పరిశీలన నిమిత్తం ఫ్రాన్స్‌ దేశానికి చెందిన సీఐఆర్‌ఏడీ సంస్థ ప్రతినిధులు శనివారం పెదవేగి మండలం బాపిరాజుగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించారు. సంస్థ సీనియర్‌ ఆర్థిక వేత్త బ్రూనో డోరిన్‌, పరిశోధకులు సెల్వియన్‌, రాఫేల్గేయ తదితరులు బాపిరాజుగూడేనికి చెందిన ఎం.సత్యనారాయణ, పి.పెదపెంటయ్య వ్యవసాయక్షేత్రాలను పరిశీలించారు.  సేంద్రియ సాగు విధానంలో ఆయిల్‌పామ్‌ సాగు, ఎరువుల తయారీ, వాడే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులతో ముఖాముఖీలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఫ్రాన్స్‌ ప్రతినిధులు సాగు విధానం, ఖర్చుల గురించి తెలుసుకున్నారు. ఏపీ రైతు సాధికారత సంస్థ వైస్‌ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.విజయ్‌కుమార్‌, ఆర్డీవో పెంచల కిశోర్‌ పాల్గొన్నారు.

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఫ్రాన్స్‌కు చెందిన సీఐఆర్‌ఏడీ సంస్థ ప్రతినిధులు శనివారం జిల్లాలో పర్యటించారు. అనంతరం సాయంత్రం కలెక్టరేట్‌లో రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి ఆయిల్‌పామ్‌ సాగు విధానాల గురించి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని