logo

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు

నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడం సంచలనంగా మారింది.

Published : 27 Nov 2022 04:30 IST

మొగల్తూరులో తనిఖీ చేస్తున్న డీఆర్‌

భీమవరం అర్బన్‌, ఆచంట, న్యూస్‌టుడే:  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నరసాపురం డివిజన్‌లోని ఆ శాఖ కార్యాలయాలన్నింటిలో రికార్డులను సబ్‌కలెక్టర్‌ సూర్యతేజ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు శనివారం తనిఖీ చేశారు. నరసాపురం, ఆచంట, పెనుగొండ, తణుకు, అత్తిలి తదితర కార్యాలయాల్లో స్థానిక తహశీల్దార్లు రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి అన్నిచోట్లా రికార్డులు సక్రమంగానే ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. గతంలో నరసాపురం, మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్లుగా పనిచేసిన కొందరు నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్‌ అయ్యారు. మొగల్తూరులో జరిగిన రిజిస్ట్రేషన్లలో భీమవరం ప్రాంతానికి చెందిన భూములు ఉన్నట్లు తెలిసింది.

మొగల్తూరు: మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్త్రాలు, కంప్యూటర్‌ సమాచారాన్ని జిల్లా స్టాంప్స్‌, రిజిస్ట్రార్‌ ఆర్‌.సత్యనారాయణ శనివారం తనిఖీ చేశారు. ఈ కార్యాలయంలో జరిగిన నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల ఉదంతంపై తమ డీఐజీ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు డీఆర్‌ విలేకరులకు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు