చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి
‘ఇదేం ఖర్మ- రాష్ట్రానికి’ ద్వారా దెందులూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న తెదేపా జాతీయాధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు.
దెందులూరు : ‘ఇదేం ఖర్మ- రాష్ట్రానికి’ ద్వారా దెందులూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న తెదేపా జాతీయాధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. తెదేపా నాయకులు కార్యకర్తలు సమీకరణలో భాగంగా దెందులూరు నియోజవర్గంలోని మల్కాపురం, కొవ్వలి, దోసపాడు, పోతునూరు, దెందులూరు తదితర గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా నాయకులు కార్యకర్తలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, బి.సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్