logo

కొల్లేరు అతిథి అరుదైన పక్షి.. తెడ్డుమూతి కొంగ

ఆకర్షణీయమైన మూతితో పక్షి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునే విహంగం తెడ్డుమూతి కొంగ (యూరేషియన్‌ స్పూన్‌బిల్‌). ఇది కొంగ ఆకారంలో ఉండి 80 నుంచి 90 సెం.మీ. పొడవు, ఒకటి నుంచి 2 కిలోల బరువు ఉంటుంది.

Published : 28 Nov 2022 06:17 IST

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆకర్షణీయమైన మూతితో పక్షి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునే విహంగం తెడ్డుమూతి కొంగ (యూరేషియన్‌ స్పూన్‌బిల్‌). ఇది కొంగ ఆకారంలో ఉండి 80 నుంచి 90 సెం.మీ. పొడవు, ఒకటి నుంచి 2 కిలోల బరువు ఉంటుంది. ఆహారం కోసం కొల్లేరుకు వలస వస్తుంటాయి. శరీరం తెలుపు వర్ణంలో, కాళ్లు, ముక్కు నలుపు రంగులో ఉంటాయి. ఆర్కిటిక్‌ ప్రాంతంలో చలి తీవ్రత కారణంగా మనదేశంతో పాటు చైనా, జపాన్‌, ఆఫ్రికా దేశాలకు వలస వస్తుంటాయి. మంచినీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ప్రస్తుతం కొల్లేరులో 200 వరకు ఈ రకం పక్షులు ఉంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని