logo

కొల్లేరు అందాలు అద్భుతం : హైకోర్టు జడ్జి

ఎదుటివారికి హాని తలపెట్టకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలంటే మానవాళి పక్షుల జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వరహాలక్ష్మీనరసింహ చక్రవర్తి అన్నారు.

Published : 28 Nov 2022 06:17 IST

బోటింగ్‌ చేస్తున్న జస్టిస్‌ చక్రవర్తి, కుటుంబ సభ్యులు

కైకలూరు, న్యూస్‌టుడే: ఎదుటివారికి హాని తలపెట్టకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలంటే మానవాళి పక్షుల జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వరహాలక్ష్మీనరసింహ చక్రవర్తి అన్నారు. కుటుంబ సమేతంగా ఆయన ఆదివారం ఆటపాక పక్షుల సందర్శన కేంద్రాన్ని సందర్శించారు. బోటుపై కొల్లేరులో విహరించి చెట్లు, గ్రిల్స్‌పై సేదతీరుతున్న విహంగాలను వీక్షించారు. కృత్రిమ పక్షుల మ్యూజియాన్ని సందర్శించి పక్షుల కిలకిల రావాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చక్రవర్తి మాట్లాడుతూ కొల్లేరు అందాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. మానసిక ప్రశాంతతకు పక్షుల కేంద్రం అనువైన చోటని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజర్‌ జె.శ్రీనివాస్‌, డీఆర్వో జయప్రకాశ్‌, న్యాయవాదులు పిచ్చుకల పవన్‌కాంత్‌, సీఐ ఎంవీఎస్‌ నాగరాజు, ఎస్సై గాయత్రి, సత్యనారాయణ మూర్తి, కోర్టు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.  
శ్యామలాంబల సేవలో.. కైకలూరు ప్రజల ఇలవేల్పు శ్యామలాంబ అమ్మవారు, మీసాల వెంకన్న స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి బి.వరహాలక్ష్మీనరసింహ చక్రవర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో వీఎన్‌కే శేఖర్‌ ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటం,  ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ ఛైర్మన్‌ గుర్రం రాంబాబు, న్యాయవాదులు అడ్డగర్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని