logo

సాంకేతిక సమస్యలతో కష్టాలు

సాంకేతిక సమస్యలు, లోపాల కారణంగా పథకాలు నిలిచిపోయాయని, వాటిని సవరించి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భీమవరంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీలు అందించారు.

Published : 29 Nov 2022 05:47 IST

పథకాల కోసం ‘స్పందన’లో వినతులు

అర్జీలు స్వీకరించి ప్రజలతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి డీఆర్వో దాసి రాజు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సాంకేతిక సమస్యలు, లోపాల కారణంగా పథకాలు నిలిచిపోయాయని, వాటిని సవరించి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భీమవరంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీలు అందించారు. యలమంచిలి మండలం కొంతేరుకు చెందిన పాలకొండ స్వామిప్రసాద్‌ తన ఆధార్‌కు మరొకరి పాన్‌కార్డు అనుసంధానం కావడంతో సంక్షేమ పథకాలు రావడం లేదని అర్జీ ఇచ్చారు. భీమవరం మండలం బేతపూడికి చెందిన పెదపూడి వెంకన్న సాంకేతిక లోపాలను సరిచేసి సదరం ధ్రువపత్రం అందేలా చూడాలని అర్జీ ఇచ్చారు. ఇన్‌ఛార్జి డీఆర్వో దాసి రాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం విషయంలో అలసత్వం వహించొద్దని సూచించారు. మొత్తం 231 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు.

పోలీసు కార్యాలయంలో.. భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 12 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి ఎస్పీ యు.రవిప్రకాశ్‌ అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులను చరవాణిలో ఆదేశించారు.

* కొందరు కులం పేరుతో తిట్టారంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాడేపల్లిగూడేనికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. * తన మనువడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని.. ఆ విషయంలో అనుమానాలున్నాయని భీమవరం రెండోపట్టణానికి చెందిన వృద్ధురాలు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని