వ్యసనాలకు బానిసై చోరీలు
చెడు వ్యసనాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ తెలిపారు.
తణుకు, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన కుప్పాల రంగారావును సోమవారం స్థానిక ఆర్వోబీ వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. తణుకు పట్టణంతో పాటు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు, రాజమహేంద్రవరం 1, 2, 3 టౌన్స్, ప్రకాష్ నగర్, దవళేశ్వరం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను అతడు అపహరించినట్లు విచారణలో తేలిందన్నారు. నరసాపురం డీఎస్పీ కె.రవిమనోహరాచారి, తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ, పట్టణ ఎస్సై వి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్‌కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు