logo

స్పందించే నాధుడు లేడు!

క్షేత్ర పర్యటనలన్నీ మధ్యాహ్నం 3 గంటలలోగానే పూర్తి చేసి అప్పటి నుంచి 5 గంటల వరకు సిబ్బంది సచివాలయంలోనే ఉండాలన్నది నిబంధన. ఈ సమయంలో అర్జీలు స్వీకరించాలి.

Published : 29 Nov 2022 05:47 IST

సచివాలయంలో మొక్కుబడిగా స్పందన
పూర్తి స్థాయిలో కనిపించని సిబ్బంది
చాలా చోట్లమూతపడిన కౌంటర్లు

నారాయణపురం-2 సచివాలయంలో మూసి ఉన్న విభాగం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: న్యూస్‌టుడే-ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం, కైకలూరు, కొయ్యలగూడెం గ్రామీణ

బోర్డు కూడా లేక..

క్షేత్ర పర్యటనలన్నీ మధ్యాహ్నం 3 గంటలలోగానే పూర్తి చేసి అప్పటి నుంచి 5 గంటల వరకు సిబ్బంది సచివాలయంలోనే ఉండాలన్నది నిబంధన. ఈ సమయంలో అర్జీలు స్వీకరించాలి. కానీ  సిబ్బంది నలుగురికి మించి ఉండటం లేదు. ఫీల్డ్‌కు వెళ్లారని ఉన్న సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల కొందరిని మరో సచివాలయంలో ఇన్‌ఛార్జులుగా నియమించగా చాలామంది రెండు చోట్లా ఉండటం లేదు. ముదినేపల్లి మండలం అల్లూరు సచివాలయంలో కార్యదర్శితో పాటు మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఇక్కడ స్పందన బోర్డుకూడా లేదు. ముదినేపల్లి పరిధిలోని కొర్రగుంటపాలెం సచివాలయంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు.

పేరుకే ఉన్నట్లుగా..

ప్రతి సచివాయంలో స్పందన కౌంటర్‌ ఉండాల్సి ఉండగా... కొన్ని చోట్ల లేనే లేవు. పేరుకు ఉన్నా మూసేసి దర్శనమిస్తున్నాయి. ‘స్పందన కంటే ఇంకా ముఖ్యమైన పనులు మాకు చాలా ఉన్నాయి’ అని ముదినేపల్లి మండలంలోని ఓ సచివాలయ ఉద్యోగి అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కంటే ఏం ముఖ్యమైన పనులు ఉంటాయన్నది ప్రశ్నార్థకం. జిల్లావ్యాప్తంగా గత ఆరు నెలల్లో స్పందనకు వచ్చిన ఫిర్యాదులు వందల్లోనే ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది.

తప్పనిసరిగా ఉండాలి

సచివాలయంలో సిబ్బంది రోజూ 3-5 గంటల మధ్య స్పందన కార్యక్రమానికి హాజరుకావాలి. కౌంటర్లో ఫిర్యాదులు స్వీకరించాలి. ఫీల్డ్‌ పనులన్నీ ఉదయమే పూర్తి చేయాలి. ఈ విషయమై సిబ్బందిని హెచ్చరిస్తా. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

అరుణ్‌బాబు, జేసీ

* జంగారెడ్డిగూడెం ఆరో సచివాలయంలో స్పందన కార్యక్రమానికి ప్రత్యేక విభాగం(కౌంటర్‌) లేదు. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఒకే ఒక్క ఫిర్యాదు వచ్చింది. అడ్మిన్‌ అందుబాటులో లేరు. ఈయన ఛాంబర్‌ ఖాళీగా కనిపించింది. మొత్తం 9 మంది సిబ్బందికి ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారు ఫీల్డ్‌కు వెళ్లారని చెబుతున్నారు.

* ఉంగుటూరు మండలం నారాయణపురం-1, 2, ఉంగుటూరు-2 సచివాలయాల్లో కౌంటర్‌ కూడా తెరవలేదు. నారాయణపురం-1లో 8 మందికి ఒక్కరు, నారాయణపురం-2లో 8 మందికి ఇద్దరు, ఉంగుటూరు సచివాయంలో 8 మందికి నలుగురు సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.

గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి సచివాలయంలోనే ప్రభుత్వం స్పందన వేదిక ఏర్పాటు చేసింది. ఆచరణలో ఉన్న లోపాలతో లక్ష్యం కుంటుపడుతోంది. సిబ్బంది లేకపోవటం, కౌంటర్లు మూసి ఉండటంతో ఫిర్యాదుదారులు వెనుదిరుగుతున్నారు. ఈ కార్యక్రమ అమలు తీరు..సిబ్బంది హాజరును సోమవారం న్యూస్‌టుడే పరిశీలించింది.


* కొయ్యలగూడెం మండలం సీతంపేటలోని గ్రామసచివాలయమిది. సోమవారం సాయంత్రం 3.20 గంటల ప్రాంతంలో వీఆర్వో, సంక్షేమ, ఇంజినీరింగ్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ స్పందన కౌంటర్‌కు అందుతున్న దరఖాస్తుల సమాచారం గురించి ఆరా తీయగా సచివాలయంలోని ఎవరూ దరఖాస్తు చేయడం లేదని డిజిటల్‌ అసిస్టెంటు పేర్కొన్నారు. కౌంటర్‌ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అప్పుడప్పుడు దరఖాస్తులు వచ్చేవన్నారు.ఇప్పుడదీ లేదన్నారు.


* ఈ చిత్రంలో కనిపిస్తున్న స్పందన కౌంటర్‌.ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురం సచివాలయంలోనిది. రోజూ మధ్యాహ్నం 3-5 గంటల మధ్య ఫిర్యాదులు స్వీకరించాల్సి ఉండగా ఇక్కడ సిబ్బంది కౌంటర్‌ మూసేసి వెళ్లిపోయారు. డిజిటల్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. మొత్తం 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. మిగిలిన వారు ఎక్కడికెళ్లారో తెలియని పరిస్థితి. ఈ సచివాలయానికి ఇప్పటి వరకూ ఒక్క అర్జీ కూడా రాలేదు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని