logo

విశిష్ట విహంగం పర్పుల్‌ హెరాన్‌

కొల్లేరుకు వలస వచ్చే విశిష్ట అతిథి పర్పుల్‌ హెరాన్‌ (ఎర్ర నారాయణ పక్షి). ఇవి నారాయణ పక్షిని పోలి 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉంటాయి.

Published : 02 Dec 2022 05:53 IST

కొల్లేరు అతిథి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొల్లేరుకు వలస వచ్చే విశిష్ట అతిథి పర్పుల్‌ హెరాన్‌ (ఎర్ర నారాయణ పక్షి). ఇవి నారాయణ పక్షిని పోలి 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇవి ఊదా, గోధుమ, ముదురు ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి. సూది వంటి ముక్కు, పసుపు రంగులో కళ్లు, కాళ్లు ఉంటాయి. మనదేశంతో పాటు శ్రీలంక, చైనా, బూటాన్‌, కంబోడియా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. సరస్సులు, నదులు, ఉప్పునీటి కయ్యలలో ఎక్కువగా ఉంటాయి. 4-5 గుడ్లు పెట్టి 21 రోజులు పొదిగి పిల్లలను చేస్తాయి. ఆహారంగా చేపలు, పురుగులను తీసుకుంటాయి. కొల్లేరులో సుమారు 5 వేల వరకు ఈ రకం పక్షులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని