logo

మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ అరెస్టు

మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబును అరెస్టు చేశామని సీఐ వి.సురేష్‌బాబు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

Published : 02 Dec 2022 05:53 IST

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబును అరెస్టు చేశామని సీఐ వి.సురేష్‌బాబు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు జరిగిన విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. గత నెల 25న సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ, తహశీల్దారు జి.అనితాకుమారి, సిబ్బంది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్త్రాలు, కంప్యూటర్‌ సమాచారాన్ని తనిఖీ చేశారు. మరుసటి రోజు జిల్లా రిజిస్ట్రార్‌ ఆర్‌.సత్యనారాయణ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించి 48 రిజిస్ట్రేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధరించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఈ నెల 28న ఆ శాఖ ఉన్నతాధికారులు జీవన్‌బాబును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశాలతో తహశీల్దారు జి.అనితాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.వీరబాబు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సబ్‌రిజిస్ట్రార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని