logo

కనువిందు చేస్తున్న మార్ష్‌ శాండ్‌పైపర్‌

చిత్తడి నేలలకు నెలవైన కొల్లేరుకు వలస వచ్చే విశిష్ట అతిథి మార్ష్‌ శాండ్‌పైపర్‌. ఇది 45- 120 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Published : 05 Dec 2022 05:07 IST

కొల్లేరు అతిథి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: చిత్తడి నేలలకు నెలవైన కొల్లేరుకు వలస వచ్చే విశిష్ట అతిథి మార్ష్‌ శాండ్‌పైపర్‌. ఇది 45- 120 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. సన్నటి సూది లాంటి పొడవైన ముక్కుతో చూపరులను ఆకట్టుకుంటూ వేసవి, వర్షాకాలాల్లో బూడిద, గోధుమ వర్ణంలోనూ, శీతాకాలంలో పాలినట్లుగా కనిపిస్తుంది. రెక్కల కింది నుంచి పొట్ట, తోక వరకు తెలుపు, కాళ్లు ఎరుపు, మెడ, ఛాతి భాగంలో గోధుమ రంగు చుక్కలతో కనువిందు చేస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా ఆర్కిటిక్‌, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి దక్షిణ ధ్రువం వైపు వలస వస్తాయి. శీతాకాలంలో మనదేశంతో పాటు ఆఫ్రికా, చైనా, కొరియా, ఆస్ట్రేలియా దేశాలకు ఆహారం కోసం వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వస్తాయి. మంచినీరు లభించే చిత్తడి నేలలు, నదులు, సరస్సుల్లో చిన్న గుంపులుగా చేరి ఫిబ్రవరి, మార్చి నెల వరకు ఉండి తిరిగి వెళ్లిపోతాయి. చిన్న చేపలు, పురుగులు, వానపాములు, చిట్టినత్తలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రస్తుతం కొల్లేరులో 400 వరకు ఈ పక్షులు ఉంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని