logo

ఇక భూదస్త్రాల నవీకరణ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే తొలి దశ కొలిక్కిరాగా డ్రోన్లు వెనక్కి వెళ్లిపోవడంతో రెండో దశపై సందిగ్ధం నెలకొంది.

Published : 08 Dec 2022 04:34 IST

క్షేత్ర పరిశీలనకు ప్రత్యేక బృందాలు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే తొలి దశ కొలిక్కిరాగా డ్రోన్లు వెనక్కి వెళ్లిపోవడంతో రెండో దశపై సందిగ్ధం నెలకొంది. ఈసారి డ్రోన్‌ హెలికాఫ్టర్‌లు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నా అవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. ఈలోపుగా రీసర్వే వివరాల ఆధారంగా దస్త్రాల నవీకరణపై కలెక్టర్‌ ప్రశాంతి దృష్టి సారించారు. ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. మొదట విడతలో రీసర్వే పూర్తయిన 16 మినహా మిగిలిన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

గుర్తింపు ఇలా.. రీసర్వే కోసం మండలానికో ఉపతహశీల్దార్‌ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, స్థానిక సచివాలయ ఉద్యోగులు కలిసి క్షేత్ర పరిశీలన జరిపి భూ యజమానుల వద్ద ఉన్న పత్రాలను రెవెన్యూ దస్త్రాలతో సరిపోల్చి తేడాలుంటే సరి చేయిస్తారు. భూములను వారసులు, కుటుంబ సభ్యులకు రాసినా, ఇతరులకు విక్రయించినా రెవెన్యూ దస్త్రాల్లో చాలా వరకు పాత యజమాని పేరే ఉండిపోతుంది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో రీసర్వేలో ఆటంకాలు ఏర్పడ్డాయి. యజమానులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడితే వారు ఎక్కడున్నారో కనుక్కోవడం కష్టమయ్యేది. ప్రత్యేక బృందాలు క్షేత్ర పరిశీలన ద్వారా ఇలాంటి సమస్యలను గుర్తించి దస్త్రాలను నవీకరిస్తాయని  సర్వే విభాగం ఏడీ జాషువా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని