logo

బీఆర్‌ఎస్‌ సభకు తరలిన ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లాయి.

Published : 19 Jan 2023 05:18 IST

చాట్రాయి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లాయి. విజయవాడ నుంచి వచ్చిన బస్సులు ఏలూరు జిల్లా చనుబండకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వేంసూరు మండలంలో వివిధ గ్రామాలకు వాటిని కేటాయించారు. చనుబండలో బస్సులను నిలిపిన చోద]కులు.. వారు చేరాల్సిన గ్రామాల వివరాలు, నాయకుల చిరునామాలు తెలుసుకొని అక్కడికి వెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది.
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో  బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు జంగారెడ్డిగూడెం డిపోనకు చెందిన 15 బస్సులు తరలి వెళ్లాయి. వాటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బేతుపల్లి గంగారం, పాకలగూడెం, రామగోవిందపురం గ్రామాలకు చెందిన వారు అద్దెకు తీసుకున్నారు. ఈ కారణంగా పలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని