logo

ఏలూరు ఎస్పీకి జాతీయ పురస్కారాలు

ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మకు రెండు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. సైబర్‌ క్రైం నేరాలను అరికట్టడంలో కృషి చేస్తూ..

Published : 21 Jan 2023 06:15 IST

రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మకు రెండు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. సైబర్‌ క్రైం నేరాలను అరికట్టడంలో కృషి చేస్తూ.. ఆ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఫలితాలు సాధించిన నేపథ్యంలో శర్మను సైబర్‌ క్రైం అవేర్‌నెస్‌ అండ్‌ డిటెక్షన్‌ విభాగంలో సిల్వర్‌ అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే పోలీసు సేప్టీ ప్రోయాక్టివ్‌ పోలీసింగ్‌ అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్న శర్మను స్కోచ్‌ అవార్డుకు ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించింది.

బాధ్యత మరింత పెరిగింది.. అవార్డులు రావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, ఏలూరు జిల్లా పోలీసుల ప్రతిభకు, సేవాభావానికి పురస్కారాలు నిదర్శనమన్నారు. అవార్డులు రావడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని