logo

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మధురానుబంధం!

అరవైతొమ్మిది సంవత్సరాల తరువాత ఆనాటి మధురానుబంధం మరోసారి ఆ పాఠశాలలో ఆవిష్కృతమైంది.

Updated : 22 Jan 2023 04:14 IST

1954-72 పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సమావేశానికి హాజరైన మిత్రులు

పోలవరం, న్యూస్‌టుడే: అరవైతొమ్మిది సంవత్సరాల తరువాత ఆనాటి మధురానుబంధం మరోసారి ఆ పాఠశాలలో ఆవిష్కృతమైంది. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1954 నుంచి 1972 వరకు ఆరు నుంచి 12వ తరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ఈ అపురూప కలయికకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు హాజరయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకోవడంతో వారు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. పోలవరం గ్రామంలో వారు నివసించిన ప్రాంతాలను సందర్శించారు. పాఠశాల పూర్వవిద్యార్థి కపిలేశ్వరరావు మాట్లాడుతూ పోలవరంలో ఆలయాల ప్రాశస్త్యం గురించి వివరించారు. తమతో కలిసి చదువుకుని మృతి చెందిన మిత్రులకు సంతాపం తెలిపారు.  ఈ సందర్భంగా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగిరెడ్డి ఆనందరావును సత్కరించారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థుల ఫొటోలను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పోలవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. కార్యక్రమానికి ప్రముఖులు సినీ ఆర్టిస్టు మహంకాళి గంగాధర్‌ తిలక్‌, రిజర్వుబ్యాంకు మాజీ అసిస్టెంటు డైరెక్టర్‌ గేరా రాజవర్ధన్‌, వివిధ కళాశాలల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసిన చాగంటి సీతామహాలక్ష్మి, ఈత, పరుగులో పలు పతకాలు సాధించిన అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి, ఎంఈవో బిబిఎస్‌ స్వరూప్‌, కొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, పక్కి రవి, నాళం గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని