logo

‘సీఎంను ‘సైకో’ అనడం చట్టవిరుద్ధం’

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ను ‘సైకో’ అని అవమానించడం చట్టవిరుద్ధమని ఏలూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది, ఏపీ లాయర్స్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు జి.రోనాల్డ్‌రాజు తప్పుబట్టారు.

Published : 23 Jan 2023 05:37 IST

తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లకు లీగల్‌ నోటీసులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ను ‘సైకో’ అని అవమానించడం చట్టవిరుద్ధమని ఏలూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది, ఏపీ లాయర్స్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు జి.రోనాల్డ్‌రాజు తప్పుబట్టారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఆయన ఆదివారం లీగల్‌ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర సమాచార శాఖ మంత్రి, ఫేస్‌ బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ అధినేతలకు కూడా నోటీసులు ఇచ్చారు.  ఇటీవల సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అని తెదేపా నాయకులు సీఎం జగన్‌పై చేస్తోన్న వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, వాటిని ఆపకపోతే చట్టప్రకారం ముందుకు వెళతామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో అశాంతి, అల్లర్లు చెలరేగితే అందుకు చంద్రబాబు, లోకేశ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని