logo

మహిళా అభ్యున్నతికి ఉమర్‌ అలీషా కృషి

స్త్రీ జనోద్ధరణకు పాటు పడిన మహనీయుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం(పిఠాపురం) నవమ పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా అన్నారు.

Published : 24 Jan 2023 05:41 IST

లలితకృష్ణప్రసాదరావు , కిరణ్‌ప్రభలకు  పురస్కారాలు అందిస్తున్న పీఠాధిపతి, నిర్వాహకులు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్త్రీ జనోద్ధరణకు పాటు పడిన మహనీయుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం(పిఠాపురం) నవమ పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా అన్నారు. భీమవరం జువ్వలపాలెంరోడ్డులో ఉన్న ఆనంద ఫంక్షన్‌ హాల్‌లో డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా వర్ధంతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన అలీషా సమాజాన్ని అధ్యయనం చేసి సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, రచయితగా మహిళాభ్యుదయానికి, హరిజనోద్ధరణకు కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ‘ఉమర్‌ అలీషా కవి’ పురస్కారాన్ని సాహితీ విశ్లేషకుడు కిరణ్‌ ప్రభ (అమెరికా) దంపతులకు, సాహితీ సేవకుడు సత్యవోలు లలితకృష్ణప్రసాదరావు(హైదరాబాదు) దంపతులకు ‘హుస్సేన్‌ షా కవి’ పురస్కారాన్ని అందజేశారు. జ్ఞాపికలతోపాటు రూ.25,116 చొప్పున పారితోషికం అందజేశారు. విశ్రాంత తెలుగు రీడర్‌ ఆచార్య జి.గిరిజామనోహర్‌బాబు(హైదరాబాదు), పారిశ్రామికవేత్త ఉద్దరాజు కాశీవిశ్వనాథరాజు మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరేది సాహిత్యమన్నారు. సమితి ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, దాయన సురేష్‌చంద్రాజీ, కోశాధికారి వడ్డాది శ్రీవెంకటేశ్వరశర్మ, సభ్యులు వేగేశ్న సత్యవతి, వడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని