logo

సంప్రదాయానికి చిహ్నాలు రంగవల్లులు

ఏ సందర్భంలో అయినా రంగవల్లులు సంప్రదాయానికి చిహ్నాలుగా నిలుస్తాయని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు.

Published : 25 Jan 2023 05:26 IST

ముగ్గును తిలకిస్తున్న  ప్రశాంతి తదితరులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఏ సందర్భంలో అయినా రంగవల్లులు సంప్రదాయానికి చిహ్నాలుగా నిలుస్తాయని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డీవో దాసి రాజు ఆధ్వర్యంలో భీమవరంలోని రాయలం రోడ్డులో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె హాజరై ముగ్గులను పరిశీలించి మాట్లాడారు. పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ రవికుమార్‌, డీటీ పవన్‌కుమార్‌, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు రాష్ట్ర స్థాయి పురస్కారం.. భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌ ప్రశాంతికి రాష్ట్ర స్థాయి బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డు లభించింది. ఆ వివరాలను ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధిక ఓటర్లను నమోదు చేసినందుకు, ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా అవార్డు ప్రకటించారని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తారని వెల్లడించారు. ఈ అవార్డుకు రాష్ట్రం నుంచి ముగ్గురు కలెక్టర్లను ఎంపిక చేయగా.. వారిలో ఒకరు మన జిల్లా కలెక్టర్‌ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని