logo

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపుమేరకు అఖిల రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో  ర్యాలీ నిర్వహించారు.

Published : 27 Jan 2023 03:47 IST

ఏలూరులో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ

రైతు సంఘాల నాయకులు,  కర్షకుల ప్రదర్శన

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపుమేరకు అఖిల రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో  ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండు మీదుగా జూట్‌ మిల్లు, అగ్నిమాపక కూడలికి చేరుకుంది. ర్యాలీ కలెక్టరేట్‌ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రైతు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, అన్నదాతల సమస్యలు పరిష్కరించాలి, రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్‌ కంపెనీలకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ, రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం  రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు.   ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథరావు, ఏపీ రైతు సంఘం నాయకుడు డేగా ప్రభాకర్‌, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.


ఎడ్లబండ్లపై వస్తున్న రైతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని