logo

అమ్మ సన్నిధిలో సన్మానమంటే పుణ్యఫలమే

‘ఎన్నో ఆలయాలు, వివిధ రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు చూశా, అయితే మావుళ్లమ్మను చూసిన సమయంలో నాకు కలిగిన తృప్తి, ఆనందం ఎక్కడా కలగలేదు’ అని సినీ నటి ఆమని అన్నారు.

Updated : 27 Jan 2023 05:24 IST

సినీనటి ఆమని

ఆమనిని సన్మానించి జ్ఞాపికను అందిస్తున్న సభ్యులు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ‘ఎన్నో ఆలయాలు, వివిధ రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు చూశా, అయితే మావుళ్లమ్మను చూసిన సమయంలో నాకు కలిగిన తృప్తి, ఆనందం ఎక్కడా కలగలేదు’ అని సినీ నటి ఆమని అన్నారు. మావుళ్లమ్మ ఆలయ 59వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు సువర్ణ కంఠాభరణంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో షూటింగ్‌ సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లానన్నారు. ఆనాడు తాను మొక్కుకున్న కోరిక ఇప్పుడు నేరవేరందని ఆనందం వ్యక్తం చేశారు. సినీరంగంలో మొదటి అవార్డు అందుకున్న సమయంలో పొందిన సంతోషం ఇప్పుడు మరోసారి కలిగిందన్నారు. అమ్మ అందరినీ చల్లగా చూడాలని అంటూ అభివాదం చేశారు. ముందుగా జరిగిన సన్మాన సభలో తితిదే మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, తెదేపా రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, పండ్లవర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు, ఆలయ సహాయ కమిషన్‌ వై.భద్రాజీ, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎం.నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని