logo

జిల్లా మారినా రాత మారదే..

జిల్లాల పునర్విభజనలో కైకలూరు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోకి చేర్చారు. ఇది జరిగి దాదాపు పదినెలలు కావస్తున్నా నేటికీ పలు శాఖల కార్యాలయాల బోర్డులపై జిల్లా పేరును మార్చలేదు.

Published : 27 Jan 2023 03:47 IST

కళాశాల ముఖద్వారం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజనలో కైకలూరు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోకి చేర్చారు. ఇది జరిగి దాదాపు పదినెలలు కావస్తున్నా నేటికీ పలు శాఖల కార్యాలయాల బోర్డులపై జిల్లా పేరును మార్చలేదు. పలు చోట్ల కృష్ణాజిల్లా పేరుకు రంగు వేసి నూతన జిల్లా పేరు రాయకుండా వదిలేయగా, కొన్ని కార్యాలయాలపై మాత్రం పాత కృష్ణా జిల్లా పేరే దర్శనమిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యాలయాలను పరిశీలించినా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా పేర్లు మార్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు