logo

లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యమా?

‘నాడు-నేడు పనుల్లో జాప్యం.. విద్యాబోధన అమలు తీరు.. పర్యవేక్షణ లోపం.. ఇవన్నీ చూస్తుంటే టైమ్‌ పాస్‌ కోసం ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Published : 29 Jan 2023 05:19 IST

కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నట్లుంది!
అధికారులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం

ఈస్టుపాలెం పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న వర్కు పుస్తకాలను చూపిస్తూ

అధికారులను ప్రశ్నిస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌, చిత్రంలో ప్రశాంతి

ఆకివీడు, న్యూస్‌టుడే: ‘నాడు-నేడు పనుల్లో జాప్యం.. విద్యాబోధన అమలు తీరు.. పర్యవేక్షణ లోపం.. ఇవన్నీ చూస్తుంటే టైమ్‌ పాస్‌ కోసం ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యం మీకు తగునా’ అని విద్యాశాఖ అధికారులపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన  ఆకివీడులోని శివాలయం ప్రాథమిక, ఈస్టుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. మండల స్థాయి అధికారుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అంచలంచెల పర్యవేక్షణ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు గుర్తించిన బెెస్టు స్కూల్‌కి తీసుకెళ్లమంటే.. మీరే ఈస్టుపాలెం స్కూల్‌కి తీసుకొచ్చారు. ఇక్కడి పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇలా అయితే ఎలా’ అని ఆర్‌జేడీ మధుసూదనరావు, డీఈవో వెంకటరమణ, డీవైఈవో శ్రీరామ్‌, ఎంఈవో రవీంద్రను   ప్రశ్నించారు. నలుగురు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని, మార్పు రాకపోతే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంతిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని