logo

ఆశాలతో ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దు

ఆశా కార్యకర్తలతో వారికి సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దని, ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖకు సేవలందిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు పోశమ్మ డిమాండ్‌ చేశారు.

Published : 01 Feb 2023 05:18 IST

డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కార్యకర్తలు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఆశా కార్యకర్తలతో వారికి సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దని, ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖకు సేవలందిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు పోశమ్మ డిమాండ్‌ చేశారు. ఏలూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద మంగళవారం ఆశాలు నిర్వహించిన  ధర్నాలో ఆమె మాట్లాడారు. గత 15 ఏళ్లుగా ఎనలేని సేవలందిస్తున్నా ప్రభుత్వం  చిన్నచూపు చూస్తోందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాలకు అనుసంధానం చేసి 3 వేల నుంచి 5 వేల జనాభాకు ఒక్కో ఆశా కార్యకర్తను కేటాయించడం దారుణమన్నారు. సర్వేల పేరుతో నెలకు మూడు సార్లు  రికార్డులు రాయిస్తున్నారని, వచ్చే వేతనంలో సగంఖర్చులకే సరిపోతోందని తెలిపారు. ప్రభుత్వమిచ్చిన ఫోన్లు పనిచేయకపోయినా సొంతంగా కొనుక్కుని పనులు చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని, దీన్ని వెంటనే ఆపాలన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి  డీఎంహెచ్‌వో నాగేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డీఎన్‌వీడీ ప్రసాద్‌, ఆర్‌.లింగరాజు తదితరులు మాట్లాడారు. నాయకులు విజయలక్ష్మి, కమల, రోజా, కామేశ్వరి, దేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని