logo

కనుల పండువగా కల్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురంలో సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 02 Feb 2023 06:14 IST

స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురంలో సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లు పెండ్లి కుమారుడు,పెండ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పాల పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అధికారులు దాతల సహకారంతో ఉచిత అన్న ప్రసాదం అందజేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  
నేత్రపర్వంగా గ్రామోత్సవం.. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి గ్రామోత్సవం బుధవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు తొళక్కం వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వాహనంపై కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు, పండితులు స్వామివారికి హారతులిచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని