logo

నిరాశ పరిచిన నిర్మలమ్మ బడ్జెట్‌ : సీపీఎం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్ర నిరాశ కలిగించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకనటలో పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 06:14 IST

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీవ్ర నిరాశ కలిగించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన అంశాలు గానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు గానీ లేవన్నారు. నిర్వాసితుల పరిహారం కోసం ప్రస్తావన లేదని, ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు గురించి ప్రస్తావన లేదన్నారు కనీసం రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు కేటాయింపు విషయంలో, రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం ఇలా ఏ అంశాలు గురించి భాజపా ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదన్నారు. ఎన్నికలున్న కర్ణాటక తదితర రాష్ట్రాలకే లబ్ధి చేకూర్చడం తప్ప ఎప్పట్లానే తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపారన్నారు.


పేదల బడ్జెట్‌ కాదు..: సీపీఐ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలది కాదని, పెద్దల బడ్జెట్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను నియంత్రించడంలో ప్రధాని మోదీ  విఫలం చెందారని విమర్శించారు. పేద ప్రజలకు ధరలు అందుబాటులోకి వచ్చే విధంగా సబ్సిడీ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ, ఆక్వా రంగాలకు సరైనా కేటాయింపులు లేవన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వేలకు నిధుల కేటాయింపు తదితర అంశాలలో స్పష్టత లేదన్నారు.


ఉద్యోగులకు నిరాశే

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉద్యోగులకు నిరాశ కల్పించిందని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పి.ఆంజనేయులు ఒక ప్రకటనలో అన్నారు. ప్రస్తుతమున్న పన్ను విధానంలో ఎటువంటి మార్పులు లేవన్నారు. కొత్త బడ్జెట్‌లో రూ.7 లక్షల లోపు వార్షికాదాయం పొందిన వారికి పన్ను ఉండదని చెప్పినప్పటికీ పాత విధానంలో ఉన్న హెచ్‌ఆర్‌ఏ, సీపీఎస్‌, ఇంటి రుణాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండబోవని అన్నారు. కొత్త బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశాలు ఏమీ లేవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని