logo

‘బడ్జెట్‌ కేటాయింపుల్లో రైతులకు అన్యాయం’

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు రైతులకు, రాష్ట్రానికి ద్రోహం చేసేలా ఉన్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు.

Updated : 03 Feb 2023 05:11 IST

బడ్జెట్‌ ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

ఉండ్రాజవరం (దెందులూరు), న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు రైతులకు, రాష్ట్రానికి ద్రోహం చేసేలా ఉన్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. దెందులూరు మండలం పోతునూరు శివారు ఉండ్రాజవరంలో గురువారం రైతులు, కౌలు రైతులు నిరసన తెలిపారు. బడ్జెట్‌ నకలు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎరువులపై రాయితీని గతంతో పోలిస్తే తగ్గించారని, దీంతో సాగు ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘ మండల అధ్యక్షుడు గండి రాజా, కార్యదర్శి సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


అన్ని వర్గాలకు వ్యతిరేకం: సీఐటీయూ

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పలు కార్పొరేట్‌ సంస్థలకు తప్ప, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ ఆరోపించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ బడ్జెట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో జి.గోపి, రవీంద్ర, అమర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని