logo

రహదారి నియమాలే ప్రాణాలకు రక్ష : ఎస్పీ

రహదారి నియమాలే ప్రాణాలకు రక్షణ అని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక గ్యారేజీ ఆవరణలో గురువారం నిర్వహించారు.

Published : 03 Feb 2023 02:17 IST

వాహన చోదకుడికి పురస్కారం అందిస్తున్న రాహుల్‌దేవ్‌ శర్మ చిత్రంలో

డీపీటీవో వరప్రసాద్‌, ఎంవీఐ విజయరాజు తదితరులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: రహదారి నియమాలే ప్రాణాలకు రక్షణ అని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక గ్యారేజీ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించడం, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఎంవీఐ విజయరాజు మాట్లాడుతూ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ డీపీటీవో వరప్రసాద్‌ మాట్లాడుతూ చోదకులకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఉత్తమ చోదకులకు పురస్కారాలు అందజేశారు. రహదారి భద్రతపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

* ఉత్తమ చోదకులు వీరే.. బీవీఆర్‌ఎం రావు (జోనల్‌ స్థాయి ప్రథమ- ఏలూరు), డి.ప్రసాదరావు (జిల్లా స్థాయి ప్రథమ- ఏలూరు), బీపీ రావు (ద్వితీయ- నూజివీడు), జె.చల్లయ్య (తృతీయ- ఏలూరు)

* ఏలూరు డిపో స్థాయిలో.. ఆర్‌వీ రావు (ప్రథమ), ఎంవీఎస్‌ఆర్‌కే కృష్ణ (ద్వితీయ), పీఆర్‌ శేఖర్‌ (తృతీయ)

* జంగారెడ్డిగూడెం..  బీకే రెడ్డి (ప్రథమ), డీవీఎస్‌ఎన్‌టీ రాజు (ద్వితీయ), ఎస్‌కేఎం షాహిర్‌ (తృతీయ)

* నూజివీడు.. డీవీకే రావు (ప్రథమ), కేఆర్‌ కృష్ణ (ద్వితీయ), బీవీ రావు (తృతీయ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని