logo

బాల్య వివాహాలు జరిగితే కఠిన చర్యలు

ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రశాంతి హెచ్చరించారు.

Published : 04 Feb 2023 05:05 IST

సంక్షేమ శాఖల అధికారులకు మాట్లాడుతున్న కలెక్టర్‌

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రశాంతి హెచ్చరించారు. ఐసీడీఎస్‌ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మీకు తెలియకుండా బాల్య వివాహాలు ఎలా జరుగుతున్నాయంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై పోక్సో చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక ముందు ఒక్క బాల్య వివాహం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

* వసతి గృహాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత శాఖాధికారులకు స్పష్టం చేశారు. తన ఛాంబర్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. చాలా చోట్ల విద్యార్థులకంటే సిబ్బంది ఎక్కువగా ఉంటున్నారన్నారు. అలాంటి వారిని మిగిలిన కార్యాలయాల్లో విధులకు కేటాయించాలని ఆదేశించారు. వసతి గృహాల్లో చేరికలు పెరిగేలా దృష్టి సారించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని