logo

భిక్షాటన కోసం బాలిక అపహరణ

భిక్షాటన కోసం బాలికను అపహరించిన కేసులో నిందితుడికి ఏడున్నరేళ్ల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తణుకు నాలుగో అదనపు ఇన్‌ఛార్జి జిల్లా జడ్జి అన్నపూర్ణ శుక్రవారం తీర్పునిచ్చారు.

Published : 04 Feb 2023 05:05 IST

నిందితుడికి ఏడున్నరేళ్ల జైలు

తణుకు, న్యూస్‌టుడే : భిక్షాటన కోసం బాలికను అపహరించిన కేసులో నిందితుడికి ఏడున్నరేళ్ల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తణుకు నాలుగో అదనపు ఇన్‌ఛార్జి జిల్లా జడ్జి అన్నపూర్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. తణుకు పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు..తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా వండీయర్‌ గ్రామానికి చెందిన మైఖెల్‌ సెల్వం రెండేళ్ల కిందట అదే జిల్లా సాతూర్‌ గ్రామం నుంచి ఓ తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి తణుకు తీసుకొచ్చాడు. బాలికను తణుకు పట్టణంలో గణేష్‌ చౌక్‌ వద్ద ఉంచి భిక్షాటన చేయిస్తూ వచ్చిన నగదుతో వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడు. 2021 మార్చి 21న బాలిక భిక్షాటన చేయడం లేదని, సరిగా నగదు తీసుకురాలేదని కోపంతో ఆమె కుడి చేతిపై కొట్టి విరగ్గొట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న అప్పటి పట్టణ ఎస్సై డి.రవికుమార్‌ బాలికను జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో వాదోపవాదనల తర్వాత నాలుగో అదనపు జిల్లా ఇన్‌ఛార్జి జడ్జి అన్నపూర్ణ మైఖెల్‌ సెల్వంకు ఏడున్నర సంవత్సరాల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని