logo

కనిపించలేదా.. కబ్జా?

నూజివీడు పట్టణంలో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక రామాయమ్మారావుపేటలో నాసిన చెరువు ఉంది.

Published : 04 Feb 2023 05:09 IST

పోతురెడ్డిపల్లి రహదారిలో కబ్జాకు గురవుతున్న అర్‌అండ్‌బీ స్థలం

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: నూజివీడు పట్టణంలో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక రామాయమ్మారావుపేటలో నాసిన చెరువు ఉంది. అక్కడ మలుపు ఉండటంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దాదాపు 30 ఏళ్ల కిందట అప్పటి అధికారులు రహదారిని నేరుగా నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు మలుపు స్థలం ఖాళీగా ఉంది. ఇది 50 సెంట్ల వరకు ఉంటుంది. ఇక్కడ గజం స్థలం రూ.10వేలు పైనే పలుకుతోంది. దీనిపై ఆక్రమణదారుల కన్ను పడింది. అందులో భవన నిర్మాణంతో పాటు షెడ్లు కూడా వేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఏకంగా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కట్టడాలు చేస్తున్నారు. మరో యూనియన్‌ నాయకులు ఆక్రమణకు సిద్ధమయ్యారు. అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు వీరి వెనుక ఉండి తతంగాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిన చెరువుకు మరోవైపు కూడా పూడ్చుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ జల వనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టణ ప్లానింగ్‌ అధికారులు సైతం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు.  


ఆక్రమణలు తొలగిస్తాం

ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే హెచ్చరించాం. ప్రస్తుతానికి పనులు నిలిపివేశారు. పొక్లెయిన్‌తో నిర్మాణాలను కూల్చివేస్తాం. అక్కడ సిమెంట్‌ రోడ్డు వేయాల్సి ఉంది. గ్యాంగ్‌మెన్ల కొరతతో ఆక్రమణల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’ అని నూజివీడు ఆర్‌అండ్‌బీ డీఈఈ సీహెచ్‌ బాబురావు తెలిపారు.

యనమదల రహదారి అంచులో వెలుస్తున్న బడ్డీ  కొట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని