logo

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత మార్ట్‌ల దోహదం

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత మార్ట్‌లు దోహదపడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు

Published : 05 Feb 2023 03:15 IST

 

సరకులను పరిశీలిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రాజశేఖర్‌, కలెక్టర్‌  ప్రసన్న వెంకటేశ్‌, ఎమ్మెల్యే ఎలీజా

చింతలపూడి, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత మార్ట్‌లు దోహదపడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. చింతలపూడి ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్‌ను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజాతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చేయూత మార్ట్‌లు చక్కని వేదికలన్నారు. మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సున్నా వడ్డీ రుణాలు, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఏలూరు జిల్లాలో రెండో చేయూత మార్ట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రూ.220 షేర్‌ ధనంతో మొత్తం రూ.45.13లక్షలతో చింతలపూడిలో మార్ట్‌ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా మాట్లాడుతూ ప్రతి మహిళ నెలకు కావాల్సిన నిత్యావసరాలను ఈ మార్ట్‌లో కొనుగోలు చేస్తే లాభాలు భారీగా ఉంటాయన్నారు. చింతలపూడి నియోజకవర్గంలోనే రెండు మార్ట్‌లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌, డీఆర్డీఏ పీడీ విజయరాజు, డీపీవో మల్లికార్జునరావు, ఏఎంసీ ఛైర్మన్‌ జానకీరెడ్డి, ఏపీఎం కొత్తపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని