logo

చెత్త రుసుముపై కొత్త ఎత్తు!

పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి వినియోగ రుసుములు (యూజర్‌ ఛార్జీలు) నూరుశాతం వసూలు చేసే దిశగా యంత్రాంగం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది

Updated : 05 Feb 2023 05:43 IST

ఆస్తి పన్ను తరహాలో వసూలుకు సన్నాహాలు

అవగాహన కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది

భీమవరం పట్టణ, న్యూస్‌టుడే: పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి వినియోగ రుసుములు (యూజర్‌ ఛార్జీలు) నూరుశాతం వసూలు చేసే దిశగా యంత్రాంగం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ రుసుములను ఆస్తి, కుళాయి పన్నుల తరహాలో వసూలు చేయాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసుల్లో చెత్త సేకరణ వినియోగ రుసుములను జతచేసి జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

వసూళ్లు నిలిచిపోవడంతో..

2021 అక్టోబరు 1 నుంచి ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చెత్తను తరలించేందుకు తొలివిడతలో 226 వాహనాలను ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 52 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కాగా అన్ని పట్టణాల్లో వినియోగ రుసుములు పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో వాహనాలకు చెల్లించాల్సిన వాయిదాలు నిలిచిపోయాయి. వేతనాలు అందకపోవడంతో వాహనాల కార్మికులు ఆందోళనబాట పట్టారు. మరోపక్క ఇంటింటా చెత్త సేకరణ నూరు శాతం అమలుకు రుసుములను తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధానంపై వార్డు అడ్మిన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో భీమవరం పురపాలక కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు.

*ఇప్పటి వరకు ప్రతి ఇంటి నుంచి నెలవారీ వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు తెచ్చేలా క్లాప్‌ యాప్‌లో పీటీ మ్యాపింగ్‌ విధానంలో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రాంతాల ఆధారంగా ప్రతి ఇంటికి రూ.30 నుంచి రూ.90 వరకు, వ్యాపార సముదాయాలు, దుకాణాల స్థాయిని బట్టి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను విధించారు. వీటన్నింటిని ఉమ్మడి జిల్లాలో ఉన్న 1,74,454 ఆస్తి పన్ను అసెస్‌మెంట్లతో సరిపోల్చే ప్రక్రియపై కసరత్తు ప్రారంభించారు.

వివరాలు సరి చూసేందుకే.. ఆస్తి పన్ను ఎసెస్‌మెంట్లకు తగ్గట్టుగా చెత్త సేకరణ వినియోగ రుసుముల చెల్లింపులు జరుగుతున్నదీ..లేనిదీ తెలుసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నామని పురపాలక ఆర్డీ ఎన్‌వీవీ సత్యనారాయణ చెప్పారు. ఆన్‌లైన్‌ నమోదు  కోసం కాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని