logo

అగ్నిగుండానికి పోటెత్తిన భక్తులు

దెందులూరు మండలం గాలయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు.

Updated : 05 Feb 2023 18:32 IST

దెందులూరు: దెందులూరు మండలం గాలయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పూజారి సతీష్ అనే యువకుడు తొలిసారి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని నిప్పుల్లో నడిచాడు. భక్తులు అగ్నిగుండంలో నడిచి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని