logo

వారానికోరోజు ఉండనీయరా!

సాధారణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సోమవారం మండల కేంద్రానికి వెళ్తే అక్కడ అధికారులంతా స్పందనలో అందుబాటులో ఉంటారనేది నమ్మకం.

Published : 07 Feb 2023 06:00 IST

స్పందన వదిలేసి గడప గడపకు...

యలమంచిలిలో వీరు మాత్రమే హాజరు

పాలకొల్లు, న్యూస్‌టుడే: సాధారణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సోమవారం మండల కేంద్రానికి వెళ్తే అక్కడ అధికారులంతా స్పందనలో అందుబాటులో ఉంటారనేది నమ్మకం. అందుకే ఆ రోజు ఎన్ని పనులున్నా వాటిని పక్కనబెట్టి ఆయా గ్రామాల నుంచి స్పందన కార్యక్రమానికి అర్జీలతో తరలివస్తుంటారు. రానురాను ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. వారానికోరోజు అదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అధికారులను ఇతర కార్యక్రమాల పేరిట అందుబాటులో ఉండనీయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యలమంచిలి మండలంలో పరిశీలిస్తే సోమవారం స్పందన కార్యక్రమానికి ముఖ్యమైన అధికారులంతా గైర్హాజరయ్యారు. అదేమని ఆరాదీస్తే పక్క గ్రామంలో జరుగుతున్న గడపగడపకు కార్యక్రమంలో హాజరవ్వడానికి వెళ్లారని సమాధానం. అలాంటప్పుడు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి గాని ఒకచోట స్పందన మరోచోట గడపగడపకు అంటే అటు అధికారులు ఇటు ప్రజలూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని అర్జీదారులు వాపోయారు. దాదాపు 20 శాఖలకు పైగా అధికారులు స్పందనకు రావాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఉండటం గమనార్హం. రెవెన్యూ నుంచి సీఎస్‌డీటీ, ఎంపీడీవో తరఫున సూపరింటెండెంట్‌ హాజరవగా ఇతర శాఖల నుంచి కనీసం కిందిస్థాయి సిబ్బంది కూడా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని