logo

సమస్యలు పరిష్కరిస్తేనే అధికారులపై నమ్మకం

 సమస్యలను సకాలంలో పరిష్కరించినప్పుడే అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Published : 07 Feb 2023 06:00 IST

స్పందనలో కలెక్టర్‌

అర్జీలు స్వీకరిస్తున్న ప్రశాంతి, మురళి తదితరులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే:  సమస్యలను సకాలంలో పరిష్కరించినప్పుడే అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి మాట్లాడారు. ఈరోజు మొత్తం 172 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు.  సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి, డీఆర్వో కృష్ణవేణి, జీఎస్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారి అప్పారావు, ఎస్‌పీడీవో శ్రీకాంత్‌, ఇన్‌ఛార్జి డీపీవో నాగలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

* తన కుమార్తె వివాహం కోసం సొమ్ము అవసరమై పొలం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఓ వ్యక్తి అడ్డుకుంటున్నారంటూ ఉండికి చెందిన టి.నారాయణరాజు అర్జీ ఇచ్చారు. తమ కుటుంబానికి ఉమ్మడి ఆక్వా చెరువు ఉందని, దానికి కొలతలు వేసేందుకు వచ్చిన అధికారులను అతడు అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు.నీ ఏలూరు నుంచి భీమవరం, నరసాపురం ప్రాంతాలకు రాత్రి 8.30 గంటల వరకు సర్వీసులు నడపాలని కోరుతూ భీమవరానికి చెందిన ప్రశాంత్‌ అర్జీ ఇచ్చారు. నీ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శి కె.చందు కోరారు. ఈ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు