logo

వినండయ్యా మా గోడు!

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

Published : 07 Feb 2023 06:00 IST

స్పందనకు తరలివచ్చిన అర్జీదారులు

అర్జీల సమర్పణ కోసం వరుసలో...

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, జేసీ అరుణ్‌బాబు, డీఆర్వో సత్యనారాయణమూర్తి తదితర అధికారులు  వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలను  నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వారు జిల్లా కేంద్రం వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు.

కొన్ని అర్జీలు ఇలా..

* నూజివీడులోని నాసిన చెరువు పరిధిలో యాభై సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పట్టణానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

* పెదవేగి మండలం సీతారామపురం, చక్రాయగూడెంలో పంట చెరువులను కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని తొలగించాలని సీతారామపురం గ్రామస్థులు కోరారు.

* పెదపాడు మండలం వట్లూరు ఎస్సీ పేటలో డ్రెయినేజీ నిర్మాణం సరిగా లేనందున మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని స్థానికులు తెలిపారు.  


* ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లికి చెందిన ఎ.శ్రీనివాసరావు తన కుమార్తె ఆశాజ్యోతి సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధితో బాధ పడుతోందని   ఆర్థిక సహాయం చేయాలని.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పింఛను పథకాన్ని తన కుమార్తెకు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్‌ ఆశాజ్యోతి వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి సూచించారు.


అప్‌లోడ్‌ చేయాల్సిందే:    స్పందన  అర్జీల పరిష్కారానికి సంబంధించిన ఛాయాచిత్రాల్ని అప్‌లోడ్‌ చేయాలని జేసీ అరుణ్‌బాబు ఆదేశించారు. రెవెన్యూ సంబంధ అర్జీల పరిష్కార చర్యలపై తహశీల్దార్లు, ఎంపీడీవోలతో   కలెక్టరేట్‌ నుంచి వీడియో సమావేశం నిర్వహించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని