logo

వారధికి రైట్‌..రైట్‌..

వశిష్ఠ గోదావరిపై నరసాపురం ప్రాంతంలో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కోనసీమ - పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ వారధి నిర్మించాలని ప్రజలు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Published : 23 Mar 2023 04:09 IST

గోదావరిపై నిర్మాణానికి కేంద్రం ఆమోదం

నరసాపురంలో పంటుపై గోదావరి దాటిస్తున్న నిర్వాహకులు

నరసాపురం, న్యూస్‌టుడే: వశిష్ఠ గోదావరిపై నరసాపురం ప్రాంతంలో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కోనసీమ - పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ వారధి నిర్మించాలని ప్రజలు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రామేశ్వరం - రాజుల్లంక గ్రామాల మధ్య గోదావరిపై వంతెన, ఇరువైపులా అనుసంధాన రోడ్ల నిర్మాణం, వాటికి కల్వర్టులు, కాలువలపై వంతెనలు నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి అవసరమైన రూ.580.42 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

21.70 కి.మీ. మేర.. కోనసీమ జిల్లా దిండి సమీపంలోని 216 జాతీయ రహదారి నుంచి రామేశ్వరంలోని వంతెన నిర్మాణ ప్రాంతం వరకూ సుమారు 14 కి.మీ. మేర అనుసంధానంగా రహదారి నిర్మించనున్నారు. రాజుల్లంకలో వంతెన నిర్మించనున్న ప్రాంతం నుంచి లక్ష్మణేశ్వరం, వైఎస్‌పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారి వరకూ సుమారు 7.5 కి.మీ. మేరకు పదిమీటర్ల వెడల్పున రోడ్డు నిర్మించనున్నారు.

56 హెక్టార్ల భూసేకరణ.. వంతెన, అనుసంధాన రహదారుల నిర్మాణానికి సుమారు 56 హెక్టార్ల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. కోనసీమ జిల్లాలో 36 హెక్టార్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 19.9 హెక్టార్ల భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇది చివరి దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. ‘ఈపీసీ విధానంలో నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. గుత్తేదారుని ఎంపికకు అధికారులు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు’ అని ప్రభుత్వ ఛీప్‌విప్‌ ప్రసాదరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని