logo

ఈదురు గాలుల బీభత్సం

ఈదురు గాలుల బీభత్సం కారణంగా తాటి చెట్టు కూలి రహదారిపై వెళుతున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా.. రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన.

Updated : 23 Mar 2023 05:50 IST

ఆటోపై తాటి చెట్టు కూలి చిన్నారి మృతి
నలుగురికి గాయాలు

సంఘటనా స్థలంలో క్షతగాత్రులు

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఈదురు గాలుల బీభత్సం కారణంగా తాటి చెట్టు కూలి రహదారిపై వెళుతున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా.. రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన నూజివీడు మండలం మర్రిబంధం-మీర్జాపురం గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ కథనం మేరకు.. ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన చంద్ర, నూజివీడు మండలం సిద్ధార్థనగర్‌కు చెందిన బత్తుల ప్రభాకరరావు(ఆటోడ్రైవర్‌),   పరిశుద్ధం, నూజివీడుకు చెందిన మాణిక్యంలు బంధువులు. వీరంతా ఆటోలో నూజివీడు మండలం సీతారామపురంలోని వారి బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. వారితో పాటు అన్షు(2)ను వెంట తీసుకెళ్లారు. పరామర్శ అనంతరం తిరిగి నూజివీడు వైపు వస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలుల ఉద్ధృతి మొదలైంది. సంఘటనా స్థలికి వచ్చే సరికి రహదారి పక్కన ఉన్న తాటి చెట్టు కూలి ఆటోపై పడింది. దీంతో వాహనం తుక్కుతుక్కైంది. అందులో ప్రయాణిస్తున్న వారు హాహాకారాలు చేస్తూ రోడ్డుపై పడిపోయారు. సమాచారం అందుకున్న మొబైల్‌ వాహనంలోని కానిస్టేబుల్‌, స్థానికులు స్పందించి గాయపడిన చంద్ర, ప్రభాకరరావు, పరిశుద్ధం, మాణిక్యంకు సపర్యలు చేశారు. చిన్నారి అన్షు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  చిన్నారి తల్లిదండ్రులు ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపలో ఉంటారు. బంధువుల వద్దకు వారి కుమార్తెను పంపగా ఈ ఘోరం జరిగింది. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రమాదం బారిన పడిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వారంతా వ్యవసాయ కూలీలు.

ప్రమాదంలో ధ్వంసమైన ఆటో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు