logo

‘ఆంగ్లం వ్యామోహంలో తెలుగుపై నిర్లక్ష్యం’

ప్రభుత్వం ఆంగ్లం వ్యామోహంలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు.  సాహిత్య మండలిలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం ఆధ్వర్యంలో శోభకృత్‌ నామ సంవత్సర  వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

Published : 23 Mar 2023 04:38 IST

పురస్కారాలు అందుకున్న కళాకారులతో ఎమ్మెల్సీ సాబ్జీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆంగ్లం వ్యామోహంలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు.  సాహిత్య మండలిలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం ఆధ్వర్యంలో శోభకృత్‌ నామ సంవత్సర  వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గరికపాటి కాళిదాసు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ నేతి సత్యనారాయణశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కవి సమ్మేళనం ఆకట్టుకుంది. సాహితీ వేత్త డాక్టర్‌ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రతిబింబించేదే నిజమైన సాహిత్యమన్నారు. పుల్లాభొట్ల శ్రీరామమూర్తి స్మారక సాహిత్య పురస్కారాన్ని కల్యాణశ్రీకి, పీఆర్‌కే కళాట్రస్ట్‌ ఉగాది కళా పురస్కారాన్ని పౌరాణిక సంగీత దర్శకులు వి.సురేష్‌రాజుకు ప్రదానం చేశారు. అలివేలు మంగతాయారు, జి.వి.రత్నశిరీష (సంగీతం), నాగాస్త్ర్‌ (సాహిత్యం), వి.రామాంజనేయ సిద్ధాంతి, ఎం.రాజగోపాలకృష్ణ చౌదరి (పౌరాణిక నాటకం), డి.రాములు (సాంఘిక నాటకం), బి.వర్షిణి (నాట్యం)లకు ఉగాది విశిష్ఠ పురస్కారాలు అందజేశారు. సంగీత దర్శకులు డాక్టర్‌ ఎస్పీఎస్‌ వాసు సంగీత కచేరీ, కళాకారుల ‘రామాంజనేయ యుద్ధ ఘట్టం’ నాటిక ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెదపాటి రామకృష్ణ, ఎండీ ఖాజావలి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని