logo

తెదేపా శ్రేణుల సంబరాలు

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు గురువారం  సంబరాలు చేసుకున్నారు.

Published : 24 Mar 2023 04:51 IST

ఉంగుటూరు: విజయోత్సాహంలో   గన్ని తదితరులు

ఏలూరు అర్బన్‌, ఉంగుటూరు, న్యూస్‌టుడే: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు గురువారం  సంబరాలు చేసుకున్నారు.  ఉంగుటూరులో  పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వైకాపా పనైపోయిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.  తెదేపా అభ్యర్థి. అనురాధ విజయం సాధించడంపై  నాయకులు, కార్యకర్తలు ఏలూరులో విజయోత్సవం నిర్వహించారు. పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి విడిది కార్యాలయం వద్ద కేకు కోసి పంచారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని