logo

అసైన్డ్‌ భూములు పంచాలని దీక్ష

అసైన్డ్‌ భూములను అర్హులైన ఎస్సీలకు పంచాలని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుల్ని అరెస్టు చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థులు దోసపాడులో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Published : 24 Mar 2023 04:51 IST

దీక్షలో పాల్గొన్న నాయకులు, గ్రామస్థులు

దెందులూరు, న్యూస్‌టుడే: అసైన్డ్‌ భూములను అర్హులైన ఎస్సీలకు పంచాలని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుల్ని అరెస్టు చేయాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థులు దోసపాడులో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్య.కా.స. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం పేదలకు చెందిన భూముల్ని వారికే ఇవ్వాలన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేదల భూములను 25 ఏళ్ల నుంచి భూస్వాములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నా వారిపై చర్యలు లేవన్నారు. ముఖ్యమంత్రి పేదల మొర ఆలకించాలని కోరారు. దోసపాడులో 144, 145 సెక్షన్లను ఎత్తేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఆనందరావు, నాగేంద్ర, కుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని