logo

ఆడుకుంటూ అంతలోనే.. చెరువులో పడి చిన్నారి దుర్మరణం

అప్పటివరకూ అందరి కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన బాలుడు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చెరువు రూపంలో మృత్యువు కబళించింది.

Published : 24 Mar 2023 04:51 IST

అగస్టీన్‌

పోతునూరు (దెందులూరు), న్యూస్‌టుడే: అప్పటివరకూ అందరి కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన బాలుడు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చెరువు రూపంలో మృత్యువు కబళించింది. దెందులూరు మండలం పోతునూరులో గురువారం సాయంత్రం కాటిక అగస్టీన్‌ (2) ఇంటి ముందు చెరువులో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కాటిక ఆదాం, ఝాన్సీలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అగస్టీన్‌ గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ ఎదురుగా ఉన్న చెరువులో పడిపోయి మృతి చెందాడు.  నానమ్మ వద్ద ఉన్నాడని తల్లి.. తల్లి వద్ద ఉన్నాడని నానమ్మ భావించారు. తల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆరా తీయగా చెరువులో కనిపించాడు. బయటకు తీసి పీహెచ్‌సీకి తరలించారు. వైద్య సిబ్బంది  పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామస్థులు బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని