logo

ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల విభజన

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం(ఐసీడీఎస్‌) ప్రాజెక్టుల పరిధుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి.

Updated : 24 Mar 2023 05:57 IST

పూర్తయిన సర్దుబాటు ప్రక్రియ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం(ఐసీడీఎస్‌) ప్రాజెక్టుల పరిధుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి. మార్పులకు అనుగుణంగా అధికారులను కూడా నియమించారు. కొత్తగా ఏర్పడిన ప్రాజెక్టులకు భవనాలు, వసతులు సమకూర్చడంతో పాటు సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది.
జిల్లాల పునర్విభజన అనంతరం కొన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కేంద్రాల పరిధిలోని మండలాలు మరో జిల్లాలోకి వెళ్లడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో వాటి పరిధుల్లో మార్పులు చేశారు. కొన్ని మండలాలు, పట్టణాలతో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు.

జిల్లాలో ప్రాజెక్టులు, వాటి పరిధులు ఇలా..

భీమవరం భీమవరం మండలం, పట్టణం, వీరవాసరం

ఆకివీడు ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు

పాలకొల్లు పోడూరు, యలమంచిలి, పాలకొల్లు పట్టణం, మండలం

తణుకు తణుకు పట్టణం, మండలం, ఇరగవరం, అత్తిలి

మొగల్తూరు నరసాపురం పట్టణం, మండలం, మొగల్తూరు

తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పట్టణం, మండలం, పెంటపాడు, గణపవరం

పెనుమంట్ర పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట

* గతంలో కొయ్యలగూడెం పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం కొత్త ప్రాజెక్టుగా ఏర్పడింది. పోలవరం పరిధిలో తాళ్లపూడి మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొయ్యలగూడెం, పోలవరం కలిపి ఒక ప్రాజెక్టుగా ఉంటాయి.

* పశ్చిమగోదావరిలో ఇకపై అంగన్‌వాడీ కేంద్రాలు 1,556, మినీ కేంద్రాలు 70, ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఏడు ఉంటాయి. ఏలూరు జిల్లాలో 1,959 ప్రధాన, 266 మినీ కేంద్రాలు 266, ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 10 ఉంటాయి.

* పశ్చిమగోదావరిలో తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం ప్రాజెక్టులు కొత్తగా ఏర్పడ్డాయి. తాడేపల్లిగూడెం ఇప్పటి వరకు నల్లజర్ల పరిధిలో, తణుకు  పెరవలిలో ఉండేవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని